VZM: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.