ప్రస్తుత సాంకేతిక ప్రపంచానికి సరితూగేలా BSNL మరో ముందడుగేసింది. దేశంలోనే తొలిసారి శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్, ప్రభుత్వ టెల్కో BSNL సహకారంతో డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తుంది. దీంతో డిజిటల్ పరికరాలకు అదనపు హర్డ్‌వేర్ లేకుండా డైరెక్ట్ శాటీలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయాలు లేని ప్రాంతాలకు ఈ D2D టెక్నాలజీ టవర్లతో పనిలేకుండా శాటిలైట్ ఫోన్ వలే ఉపయోగించవచ్చు.