స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనికి ‘నయనతార బియాండ్ ది ఫెరిటేల్’ అనే టైటిల్ను మేకర్స్ పెట్టారు. తాజాగా దీని రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 18 నుంచి సదరు సంస్థలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ఫ్లిక్స్ పోస్టర్ షేర్ చేసింది.