PPM: పార్వతీపురం మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి పరిపాలనతోనే ప్రజలకు మంచి జరుగుతుందని భావించి టీడీపీలో చేరినట్లు కౌన్సిలర్లు తెలిపారు. అన్ని వర్గాలకు అండగా సీఎం చంద్రబాబు పరిపాలన ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.