TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు విచారణలో భాగంగా రాజ్ పాకాల మోకిల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన అడ్వకేట్‌తో కలిసి పీఎస్‌లో హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన విషయాన్ని పోలీసులు విచారించనున్నారు. కాగా.. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. కొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.