VZM: నెల్లిమర్ల ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బుధవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిఆర్ఓ ఎస్.శ్రీనివాస మూర్తి, ఆర్డిఓ డి.కీర్తి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ భాస్కరావు పాల్గొన్నారు.