PDPL: జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం లేదు. దీంతో రైతులు తేమ శాతం తగ్గించుకోవడం కోసం వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద కాకుండా ప్రధాన రహదారుల వెంబడి వరి ధాన్యాన్ని ఆరబోస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యాన్ని రోడ్‌పై పోయడంతో వాహనదారులు ప్రమాద భారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.