VZM: రాజాం-చీపురుపల్లి రోడ్డులో మంగళవారం డీఎస్పీ రాఘవులు, టౌన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరా సాయంతో ప్రమాదకర బ్లాక్ స్పాట్ లను గుర్తించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్ లను గుర్తించి అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు.