AP: YCP అధినేత జగన్, షర్మిల వివాదంపై YS విజయమ్మ రాసిన లేఖకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దివంగత మహానేత YSR భార్యగా, మాజీ సీఎం జగన్ తల్లిగా విజయమ్మను గౌరవిస్తామని పేర్కొంది. కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నామంటూ కొన్ని ప్రశ్నలు సంధించింది. జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదోవ పట్టించడమేనని వెల్లడించింది. షర్మిల ఒత్తిళ్లకు లొంగి విజయమ్మ ఇలా వ్యవహరిస్తున్నారని Xలో పోస్ట్ చేసింది.