ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో మంగళవారం రాత్రి 11.30 సమయంలో కృష్ణ థియేటర్ వద్ద గల ఎస్బీఐ ATMలో దొంగలు పడ్డారు. అనంతరం ATM పగలగొట్టి నగదు చోరికి ప్రయత్నించారు. ఘటనపై బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే దొంగను అదుపులోకి తీసుకున్నారు.