చలికాలంలో సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఎండలో వాకింగ్ చేయడం వల్ల విటమిన్ D ఎక్కువగా లభిస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు వెచ్చగా ఉండే దుస్తులు వేసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులను ఎక్కువగా ధరించాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. కూల్ డ్రింక్స్, ఐస్క్రీంలకు దూరంగా ఉండాలి.