సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోలీవుడ్ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ కన్నుమూశాడు. కొచ్చిలోని అతని అపార్ట్మెంట్లో ఇవాళ ఉదయం విగతజీవిగా కనిపించాడు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సూర్య నటించిన ‘కంగువ’ సినిమాకు నిషాద్ ఎడిటర్‌గా పనిచేశాడు.