AP: కడప అన్నా క్యాంటీన్లో భారీ పేలుడు సంభవించింది. పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఈ ప్రమాదం జరిగింది. వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ పేలుడు సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి వంటశాల షెడ్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.