ADB: ముధోల్ మండలం జఠశంకర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాసర మండలం కిర్గుల్కి చెందిన అలిశెట్టి విఠల్(61) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ సాయికిరణ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. తానూరు మండలం నంద్‌గాం గ్రామం వద్ద బైక్ ఢీకొని విఠల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.