SRPT: మహిళలందరికీ స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.