రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా… పార్టీ బలం లేకపోవడంతో… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కు మంచి హోదానే ఉన్నప్పటికీ… ఆ పార్టీలో ఉండటం వల్ల రేవంత్ కి ఒరిగింది ఏమీ లేదు. పైగా… అధికా పార్టీ నుంచి ఆయన మీద టార్గెట్ మాత్రం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రేవంత్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రేవంత్ రెడ్డి దూకెయ్యనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఆయన తొలుత బీజేపీ వైపు చూశారంటారు కొందరు. బీజేపీ నుంచి ఆయనకు ఆశించిన రీతిలో ‘పదవి’ విషయమై హామీ దక్కకపోవడంతో ఆయన వెనకడుగు వేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజం ఉందో మాత్రం తెలియదు.. కానీ ప్రచారాలకు మాత్రం పులిస్టాప్ పడటం లేదు.
అయితే… ఇక్కడే కొందరికి అనుమానాలు మొదలయ్యాయి. కాస్తో కూస్తో బలంగా ఉన్న కాంగ్రెస్ ని వదిలేసి.. తెలంగాణలో ఏమీ లేని టీడీపీలో ఆయన ఎలా చేరతారు అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే… ఇటీవల కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో..తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశాల్ని రేవంత్ రెడ్డి గుర్తించారట.
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని పంపిందే చంద్రబాబు.. అని అంటారు. అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పటికీ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి బోల్డంత భక్తి భావం. ఒకవేళ కేసీయార్ స్థాపించిన బీఆర్ఎస్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు సాధ్యమైతే.. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ఊపు వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదే జరిగితే… మళ్లీ టీడీపీ తెలంగాణలో పుంజుకుంటే.. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఒకప్పటి టీడీపీ నేతల్లో చాలామంది.. తిరిగి టీడీపీ వైపుకు వెళ్ళే అవకాశాలూ లేకపోలేదని మరి కొందరి వాదన. మరి వాదనలు నిజంగా కార్యరూపం దాలుస్తాయో లేదో చూడాలి.