ADB: తలమడుగు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి పడాల రవీందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హత గల ఉపాధ్యాయ, నిరుద్యోగ అభ్యర్థులందరూ నవంబర్ 6 లోగా ఆన్లైన్లో ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. ఓటరు నమోదు గడువు తేదీని పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.