JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం జనగామ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్ర శర్మ, సురేఖ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి దంపతులకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.