మాదాపుర్ కేబుల్ బ్రిడ్జి(Cable bridge)పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు చేసుకున్న యువతి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా(Gulbarga)కు చెందిన పాయల్(17)గా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ నివాసం ఉంటున్నఉద్యోగం నిమిత్తం నాలుగు నెలల క్రితం యువతి హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నడుస్తూ ఒక్కసారిగా పైనుంచి దుర్గం చెరువులోకి దూకేసింది. చెరువులోకి దూకకుండా పాయల్(Payal)ను.. ఆమె స్నేహితురాలు అపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పాయల్ స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారం విషయంలో.. యువతి తల్లిదండ్రులు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య(suicide)కు పాల్పడినట్లు భావిస్తున్నారు. దుర్గం చెరువు లేక్ పోలీసులు యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు మాదాపూర్ పోలీసులు(police) భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.