»We Will Fight With The Aim Of Ousting The Central Government Cpm
Tammaneni : కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో పోరాటాలు చేస్తాం : సీపీఎం
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (Bjp) వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్దం అవుతామని సీపీఎం (Cpm) రాష్ట్ర కార్యదర్మి తమ్మనేనీ (Tammanēnī) వీరభద్రం అన్నారు. ప్రతి పక్షనాయకుల, సంస్థలపై, వ్యక్తులపై ఈడి, (ED) సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (Bjp) వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్దం అవుతామని సీపీఎం (Cpm) రాష్ట్ర కార్యదర్మి తమ్మనేనీ (Tammanēnī) వీరభద్రం అన్నారు. ప్రతి పక్షనాయకుల, సంస్థలపై, వ్యక్తులపై ఈడి, (ED) సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి తప్ప ప్రధాని మోదీ (PM MODI) అనుచరుడైన ఆదాని, అతని సంస్థలపై ఎందుకు సీబీఐ, ఐటీ దాడులు జరగడంలేదని తమ్మినేనీ ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకు బీజేపీ (Bjp) నియంతృత విధానాలు పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో (BRS) రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తమ్మినేనీ వీరభద్రం స్పష్టం చేశారు.
ఇంతవరకు సీపీఎం, బీఆర్ఎస్ ల మధ్య సీట్ల పొత్తు విషయంలో చర్చలు జరగలేదని ఆయన వెల్లడించారు. దేశంలో మతతత్వ దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. మార్చి 15 నుంచి 30 వరకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను నిరసిస్తూ సీపీఎం (Cpm) పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ను నిర్వహిస్తామని తమ్మినేనీ వీరభద్రం వెల్లడించారు. నల్లగొండలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఎం ప్లీనరీలో పాల్గొన్నారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు