»Vivekas Son In Law Came To The Cbi Office For The Second Time
CBI : రెండో సారి సీబీఐ కార్యాలయానికి వచ్చిన వివేకా అల్లుడు
వివేకా రాసినట్టుగా భావిస్తున్న లేఖ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సీబీఐ (CBI) ఈ మేరకు వివరాలు సేకరిస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) మరోసారి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.మూడు రోజుల కిందటే రాజశేఖర్ రెడ్డిని సీబీఐ (CBI) ఈ కేసులో తొలిసారిగా విచారించింది. తాజాగా, ఆయనను సీబీఐ మరోసారి తమ కార్యాలయానికి పిలిపించింది. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ (CBI) అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వివేకా రాసినట్టుగా భావిస్తున్న లేఖ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సీబీఐ ఈ మేరకు వివరాలు సేకరిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది.
ఈ నెల చివరిలోగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు (Supreme Court) డెడ్ లైన్ విధించడంతో అన్నికోణాల నుంచి దర్యాప్తు అధికారులు చేపడుతున్నారు. ఈ కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) కోఠీలోని సీబీఐ కార్యాలయానికి వివేకానంద రెడ్డి అల్లుడు , సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వివేకా కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ ముగిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులతో భేటీ అయ్యారు.వివేకా రెండో భార్య (Shamim) సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్ వెలుగులోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడు తనను చాలా సార్లు బెదిరించారని షమీమ్ సీబీఐ అధికారులకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.