MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్య క్షేత్రంలో వన దుర్గ భవాని మాతకు శనివారం రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో రుత్వికులు స్థిర వాసరే పురస్కరించుకొని మూలమూర్తి దేవికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో వేదోక్తంగా విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.