Tirupati : 15 నిమిషాల ముందే తిరుపతికి చేరుకున్న వందే భారత్ రైలు
బుధవారం తొలిసారిగా 16 బోగీలతో సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ముందుగా అనుకున్న సమయానికంటే 15 నిమిషాల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంది. 8.15 గంటల్లోనే వందేభారత్ తిరుపతికి చేరుకుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి (Tirupati) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 బోగీలతో మొదటి ట్రిప్ బుధవారం నుంచి ప్రారంభమైంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి 109శాతం ప్రయాణికులతో బయలుదేరినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో రైలు గమ్యస్థానానికి చేరుకున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) ప్రారంభమైన నాటి నుంచి ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చిందన్నారు. ఈ రైలు రెండు వైపులా 130శాతం కంటే ఎక్కువ ఓఆర్‌తో నడిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే రైలులోని కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కి రెట్టింపు చేసింది.
సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్య పెంచాలంటూ ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో, రైల్వే శాఖ వందేభారత్‌లో బోగీలను 8 నుంచి 16కు పెంచింది. దాంతో, రైల్లో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కు పెరిగింది. ప్రస్తుతం వందేభారత్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్(Executive Class)లో 104 సీట్లు, ఛైర్ కార్లో 1024 సీట్లు ఉన్నాయి. బుధవారం నాటి తొలి ట్రిప్ కోసం 1228 మంది ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ చేసుకున్నారు. కాగా, తొలిట్రిప్‌లో భాగంగా తిరుపతికి 109శాతం ఆక్యుపెన్సీ రేషియోతో వందేభారత్ ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. రానూపోనూ ప్రయాణాలకు 130 శాతం ఓఆర్ ఉన్నట్టు పేర్కొన్నారు. వందే భారత్ రైలులో జీపీఎస్(GPS) ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న విషయం తెలిసిందే.