హైదరాబాద్ లోని ఉప్పల్ లో స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. నగరంలో మరికొన్ని స్కైవాక్ బ్రిడ్జ్ లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం అవ్వనుంది.
హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. ఉప్పల్ జంక్షన్(Uppal Junction) వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పాదాచారుల కోసం స్కై వాక్(Sky walk) నిర్మాణం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 30 అడుగుల ఎత్తులో మెట్రో రైళ్లూ నడుస్తున్నాయి. ఇప్పుడు అదే ఎత్తులో స్కైవాక్ బ్రిడ్జి రూపుదిద్దుకుంది. జూన్ 26వ తేదిన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ స్కై వాక్ ప్రారంభం కానుంది.
స్కైవాక్ బ్రిడ్జి(Sky walk Bridge)పై నడుస్తుంటే ఆకాశంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉండటమే కాకుండా వాహనాల సౌండ్స్ అస్సలు వినిపించవు. దేశంలోని మెట్రో నగరాల్లో 2020 నుంచే స్కై వాక్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే చెన్నైలో ఈ బ్రిడ్జిలు దర్శనమిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రూ.25 కోట్లతో ఈ స్కైవాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
ఈ స్కైవాక్ బ్రిడ్జి(Sky walk Bridge)పై సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే పాదాచారుల కోసం మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. రెండు వైపులా రక్షణ కోసం రెయిలింగ్ సెట్ కూడా ఉంది. సిటీలోనే అతిపెద్ద ఉప్పల్ జంక్షన్ లో ఈ స్కై వాక్ బ్రిడ్జిని నిర్మించారు. త్వరలోనే మరికొన్ని వంతెనలు ఇలాంటివే నగరంలో నిర్మాణం కానున్నాయి. పైలట్ ప్రాజెక్టుల కింద ప్రస్తుతం ఉప్పల్, మెహదీపట్నంలో వీటిని నిర్మించారు. భవిష్యత్తులో మరికొన్ని సిటీల్లో కూడా ఇటువంటివి ఏర్పాటు కానున్నాయి.