సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఆర్టీసీ రాజధాని బస్సులో మంటలు (Bus catches fire) వచ్చాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తెలంగాణ (TSRTC)కి చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ (Hyderabad) నుండి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు (Andhra Pradesh, Vijayawada)కు వెళ్తోంది. బస్సు ఇందిరా నగర్ వద్దకు చేరుకున్ సమయంలో ఓ స్కూటీ వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటీ బస్సు కింది భాగంలోకి వెళ్లింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణీకులు వెంటనే కిందకు దిగారు. కొద్ది సేపట్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్కూటీ పైన ఉన్న 48 ఏళ్ల రాజు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ బస్సు మియాపూర్ డిపోకు చెందినది.