TS Gruha Jyothi Scheme : గృహ జ్యోతి పథకానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ని అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ప్రస్తుత బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది.
TS Gruha Jyothi Scheme : తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు పరిచే దిశగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పేదలందరికీ ఉచిత కరెంటు ఇచ్చేందుకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (2024-2025)ను శనివారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశ పెట్టారు. గృహ జ్యోతి పథకం కోసం రూ.2,418 కోట్లను కేటాయించారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్యుత్ సంస్థలు ట్రాన్కో, డిస్కమ్‌లు, ట్రాన్కోల కోసం రూ.16,825 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కిందే కాకుండా రైతులకూ నాణ్యమైన కరెంటును అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు 2024-25:
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు