హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నాంపల్లి (Nampally) ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు వెహికల్స్ డైవర్షన్ (Diversion of Vehicles) ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Exhibition Ground) లో చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి జనం ఇప్పటికే సిటీకి చేరుకున్నారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు(Sudhir Babu) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. చేప ప్రసాదానికి వచ్చేవారి వాహనాలు కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. డైవర్షన్స్ ఇలా..ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్‌ను అబిడ్స్ (Abids) జీపీవో, నాంపల్లి స్టేషన్‌మీదుగా దారి మళ్లిస్తారు. బేగంబజార్ ఛత్రి, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్‌ను దారుసలాం, ఏక్ మినార్ వైపు దారి మళ్లిస్తారు. అసెంబ్లీ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్, అఫ్జల్‌గంజ్(Afzalganj) వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్బాగ్ఏఆర్ పెట్రోల్‌పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా పంపిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.