TG: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై BJP జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు నిజామాబాద్ అనే పేరు అపశకునంలాగా మారిందని… బీజేపీ వ్యక్తి మేయర్ అయిన వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని కీలక ప్రకటన చేశారు. మేయర్ మొదటి తీర్మానం నిజామాబాద్ పేరు మీదే ఉంటుందని స్పష్టం చేశారు.