కృష్ణా: తోట్లవల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోదరుడు వర్ల చైతన్య పాల్గొని, ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వద్ద నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు.