telangana Election counting in 15 areas in Hyderabad Traffic restrictions on those routes
ఎన్టీఆర్ వందో జయంతి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ లోకైత్లాపూర్ (Kaitlapur) గ్రౌండ్లో జరుగనున్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి (Kukatpally) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ (Cyberabad) కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) తెలిపారు. దాదాపు ఇరవై వేల మంది పాల్గొనవచ్చని భావిస్తున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 10గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆంక్షలు విధించినట్టు చెప్పారు. వీటి ప్రకారం మూసాపేట్(Musapate)నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్, హైటెక్ సిటీ వైపు వచ్చే వాహనాలను మూసాపేట్ చౌరస్తా నుంచి కూకట్పల్లి బస్టాప్, జేఎన్టీయూ జంక్షన్ వైపు మళ్లించనున్నట్టు తెలిపారు.డీఎల్ నుంచి మాదాపూర్, హఫీజ్పేట్వైపు వచ్చే వాహనాలను ఐడీఎల్ (IDL) జంక్షన్ నుంచి కూకట్పల్లి బస్టాప్, కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్1, జేఎన్టీయూ జంక్షన్వైపు మళ్లిస్తామన్నారు. హైటెక్‌సిటీ (Hi-tech city) నుంచి కూకట్పల్లి, మూసాపేట్వైపు వచ్చే వాహనాలను కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్వద్ద మళ్లించి లోదా అపార్ట్మెంట్స్, కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్1వైపు మళ్లించనున్నట్టు చెప్పారు. పర్వత్‌నగర్, మాదాపూర్(Madapur) వైపు నుంచి కూకట్పల్లి, మూసాపేట్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ సిగ్నల్ చౌరస్తా నుంచి మళ్లిస్తామన్నారు. ఇటుగా వచ్చే వాహనదారులు ఎడమ వైపు తిరిగి వంద అడుగుల ముందుకెళ్లి యూ టర్న్తీసుకోవాల్సి ఉంటుందని తెలియచేశారు.