»Traffic Ban To Karnataka Telangana Raichur Collector Orders
Traffic Ban : కలెక్టర్ కీలక ఆదేశాలు.. కర్ణాటక – తెలంగాణలకు రాకపోకలు బంద్..!
నారాయణపేట జిల్లా కృష్ణా మండల రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిజాం కాలం నాటి కృష్ణా వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కృష్ణా వంతెన మీదుగా వెళ్లే జాతీయ రహదారి-167ను మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Traffic Ban : నారాయణపేట జిల్లా కృష్ణా మండల రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిజాం కాలం నాటి కృష్ణా వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కృష్ణా వంతెన మీదుగా వెళ్లే జాతీయ రహదారి-167ను మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జనవరి 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రాయచూర్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కర్ణాటకలోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు వెళ్లే వాహనదారులు ఆంక్షలు పాటించాలని కోరారు.
వంతెన మరమ్మతుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు కృష్ణా, మరికల్, మక్తల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ వంతెన గతంలో పలుమార్లు మరమ్మతులకు గురైంది. కానీ ప్రయోజనం లేకపోయింది. నిత్యం ప్రమాదాలు జరిగే ఈ వంతెన స్థలంలో కొత్త వంతెన నిర్మాణం చేపడితే సౌకర్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.