»Supreme Court Gives Green Signal To Palamuru Rangareddy Project
green signal : పాలమూరు-రంగారెడ్డిప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది.
పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది. అలాగే తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించు కోవాలని స్పష్టం చేసింది.ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.
అదే విధంగా ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) (NGT) విధించిన రూ. 500కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ. తదుపరి విచారణను ఆగష్టుకు వాయిదా వేసింది.కాగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 528 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది.