దక్కన్ షాపింగ్ మాల్లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజినీరింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
దక్కన్ షాపింగ్ మాల్ ‘ఎల్’ షేపులో ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతుంది. మృతదేహాలను తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అస్తి పంజరం లభించిన చోట బూడిదను క్లూ కోసం పోలీసులు తీసుకున్నారు. ఆ భవనం రెసిడెన్షియల్ కాగా కమర్షియల్గా ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఫైర్ సేప్టీ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని వెల్లడించారు. భవనంలో సింథటిక్, టైర్లు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. రెండురోజులు అవుతున్నా వేడి తగ్గడం లేదు. భవన యజమాని మహ్మద్, రహీంపై కేసు నమోదు చేసి, ప్రశ్నించిన సంగతి తెలిసిందే