Sarpanch navya: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే బరిలో నవ్య?
స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో మరో మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బరిలో తాను కూడా ఉంటానని జనాకీపురం సర్పంచ్ నవ్య అనుహ్య ప్రకటన చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది.
BRS: తెలంగాణా(Telangana)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటి విడత ఎమ్మెల్యే(MLA) సీట్లను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇంకా కొన్ని చోట్ల టికెట్లను ప్రకటించలేదు. అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) సొంత నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) గత కొంత కాలంగా వార్తల్లో ఉంటుంది. దానికి కారణం జానకీపురం గ్రామ మహిళా సర్పంచ్ నవ్య(sarpunch navya). గత కొంత కాలంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై మీడియా ముఖంగా పలు ఆరోపణలు చేశారు. తరువాత జరిగిన అనుహ్య పరిణామాల వల్ల మొదటి దశ టికెట్ కెటాయింపులో భాగంగా ఎమ్మెల్సీ కడీయం శ్రీహారి పేరును ప్రకటించారు.
అయితే తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో సర్పంచ్ నవ్వ పోటీ చేస్తానంటోంది. గ్రామంలోని అంబేద్కర్ విగ్రాహానికి పూలమాల వేసి మీడియా ముఖంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. బీఆర్ఎస్ అధిష్టానం తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. త్వరలోనే పార్టీ పెద్దలను కలసి ఈ విషయం చర్చిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజయ్యకు తన మూలంగానే టికెట్ రాలేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మరీ ఆమెకు తన సొంత పార్టీ టికెట్ ఇస్తుందా లేదా ఇతర పార్టీలు ఎవైనా ఆఫర్ చేస్తాయా అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ తరుఫున కడీయం శ్రీహారి ఉన్నారు. కాబట్టి ఇతర పార్టీలను టికెట్‌ను ఆశిస్తూ..తాను రేసులో ఉన్నట్లు చూపించుకుంటుందా అనే కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.