రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తల్లిందండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తోనూ ఆయన మాట్లాడి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.