Revanth reddy:రేవంత్‌కు కొరమేను చేప ఫ్రై, కూర అందించిన ముదిరాజ్ యువకుడు
Revanth reddy:రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి వరంగల్ (warangal) జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ముదిరాజ్ (mudiraj) సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుటుంబం రేవంత్ రెడ్డి (revanth reddy) కోసం ప్రత్యేకంగా కొరమేను చేప కూర వండి భోజనం పంపించింది.
Revanth reddy:తెలంగాణ గట్టు మీద రాజకీయం వేడెక్కింది. అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే వైఎస్ షర్మిల (sharmila), బండి సంజయ్ (bandi sanjay) పాదయాత్ర చేయగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వారితో కలిశారు. సీఎం కేసీఆర్ (kcr) లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి వరంగల్ (warangal) జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. అడుగడుగునా ఆయనకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ వర్గాలకు మేలు చేస్తుందని రేవంత్ చెబుతున్నారు.
ముదిరాజ్ (mudiraj) సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుటుంబం రేవంత్ రెడ్డి (revanth reddy) కోసం ప్రత్యేకంగా కొరమేను చేప కూర వండి భోజనం పంపించింది. చేపలకూరను (fish curry) వారే ఆయనకు అందజేశారు. ముదిరాజ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఆ ఇంటికి వచ్చారు. రేవంత్ రాక నేపథ్యంలో కిరణ్ చెరువులోంచి కొరమేను చేపలను పట్టుకొచ్చారు. తాజా చేపలతో రుచికరమైన పులుసుతోపాటు, ఫ్రై చేసి రేవంత్ కు పసందైన భోజనం అందించారు.
రేవంత్ రెడ్డి ట్వీట్ (tweet) చేశారు. ఈ ప్రేమ (love) ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని రేవంత్ రెడ్డి (revanth reddy) పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే తన పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి (revanth reddy) ట్వీట్ చేశారు. 20 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ (ysr) పాదయాత్ర (padayatra) చేశారని.. ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని ధీమాతో ఉన్నారు.
రైతు పదివేళ్లు మట్టిలోకి పోతేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. రైతు బిడ్డగా వ్యవసాయం కార్యకలాపాల్లో పంచుకోవడం మధురానుభూతిని మిగిల్చింది. యాత్రలో మొక్కజొన్న తోటలో కోతమిషన్ నడపడం చాలా ఆనందాన్ని కలిగించింది
టీ కాంగ్రెస్‌లో నేతల మధ్య సయోధ్య ఉండదు. ఎవరికీ వారే యమునా తీరే అన్నవిధంగా వ్యవహరిస్తారు. అందుకోసమే కాంగ్రెస్ ఇంచార్జీ ఠాక్రే రాష్ట్రంపై ఫోకస్ చేశారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించి.. పదే పదే వస్తూ.. నేతలతో సమావేశం అవుతున్నారు.
He walked from Gandhi Bhavan to Kondagattu temple to pray for my PCC President post.
As he bought a new auto with his hard earned money,I was the first person to get into it. It is people like him who inspire us to move forward & fight despite the difficulties. #YatraForChangepic.twitter.com/f4nkSI1vcX