»Ready To Resign From Mp Postsrevanth Venkat Reddy
MP పదవులకు రాజీనామా? రాహుల్కు మద్దతు ప్రకటించిన రేవంత్, కోమటిరెడ్డి
MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు.
Ready to resign from MP posts:Revanth, venkat reddy
MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు. ఇటు గాంధీభవన్లో (gandhi bhavan) కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టాయి.
రాహుల్ గాంధీ (rahul gandhi) అనర్హత వేటుపై పోరాటం కొనసాగుతోందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. ఆందోళనలకు సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలపై చర్చ జరుగుతోందని చెప్పారు. ఏఐసీసీ (aicc) నిర్ణయం మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు.
ఇదే అంశంపై మరో ముఖ్య నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) స్పందించారు. గాంధీభవన్ (gandhi bhavan) వద్ద జరుగుతున్న దీక్ష స్థలిలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (rahul gandhi) కోసం ప్రాణా త్యాగానికి కూడా సిద్దమేనని చెప్పారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి (prime minister) అయ్యే అవకాశం వచ్చినా.. రాహుల్ గాంధీ (rahul gandhi) వదులుకున్నారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై అనర్హత వేటు విషయం తెలిసి కంటతడి తెప్పిస్తోందని తెలిపారు.
అదానీ (adani) కుంభకోణం గురించి మాట్లాడటంతో రాహుల్ గాంధీపై (rahul gandhi) కుట్ర చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (venkat reddy) ఆరోపించారు. పరువునష్టం కేసులో ఆగమేఘాల మీద శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత ఎత్తి వేసేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఇందిరాగాంధీపై (indira gandhi) వేటు వేసిన సమయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పారు.
అనుచిత వ్యాఖ్యలపై సూరత్ కోర్టు (surat court) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బెయిల్ ఇస్తూనే.. శిక్షను పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజులపాటు శిక్షను నిలిపివేసింది. దీంతో ఆయన పై కోర్టును ఆశ్రయిస్తే సానుకూల ఫలితం వస్తే అనర్హత వేటుకు గురయ్యే అవకాశం లేదు. అయితే ఇంతలోనే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 8 ప్రకారం.. ఆర్టికల్ 102 (1) ఈ నిబంధన మేరకు లోక్ సభ సచివాలయం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.