వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్ఆర్టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంంది. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చేసింది. దీంతో టీఆర్ఎస్ను వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే జిల్లాలోని పలు చోట్ల పొంగులేటి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో భేటీ అయిన ఆయన నేడు వైఎస్ విజయమ్మతో సైతం భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 8 న పాలేరు లో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అదే రోజున పొంగులేటి వైఎస్సార్టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.