ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగ...
షర్మిల పార్టీ మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆమె స్పందిస్తూ.. పార్టీ మారడం లేదని, తన మీద దృష్టిసారించే బదులు.. సీఎం కేసీఆర్ అవినీతి మీద ఫోకస్ చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. రక్షణశాఖ భూములను కావాలని అంటోంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ కలిసి విన్నవించారు. స్కై వేకోసం ఆ భూమి కావాలని.. అదే రేటు ఉన్న మరో చోట భూమి ఇస్తామని చెబుతున్నారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతు పవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించడం వల్ల పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేంధర్ ఫైరయ్యారు. ప్రజల సొమ్ముతో భవనాలు నిర్మిస్తే.. సొంత డబ్బులతో నిర్మించినట్టు కలరింగ్ ఇస్తారెంటీ అని మండిపడ్డారు.
వైఎస్‌ఆర్‌టిపి(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
రెండు సార్లు ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు లేవంటున్నారని విమర్శించారు.
తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు గురించి విచారణ సందర్భంగా TSPSC పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్‌లో హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను అరికట్టడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని నిలదీసింది.
అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జులై 12 నుంచి16 తేదీ వరకు బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం పోటీల్లో పాల్గొనే 54మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.