»Merger Of Ysrtp In Congress Party Mp Post For Sharmila
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టిపి విలీనం.. షర్మిలకు ఎంపీ పదవి?
వైఎస్ఆర్టిపి(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
Reveal who take rs.3 lakhs to dalith bandu deserves
YS Sharmila: వైఎస్ఆర్టిపి(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ చాలా మంది విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచార వార్తలను షర్మిల స్వయంగా ఖండించినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు మొదలైన ప్రచారం ఆ తర్వాత ఆగిపోయినా మళ్లీ ఇప్పుడు ఊపందుకుంది. విలీనం చేయాలన్న నిర్ణయం దాదాపుగా ఖరారైందంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆమెకు ఆఫర్ విషయంలోనూ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఆమెను కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎమ్మెల్యే కోటా కింద పంపించడానికి కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతల విషయంలో తెలంగాణకు బదులుగా ఆమె సేవలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునే అవకాశం ఉన్నది.
నాలుగు రోజుల క్రితం పార్టీ ముఖ్య నేతలు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయమై చర్చించారని, విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, షర్మిల కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడి ఆడబిడ్డగా ప్రచారం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్న విషయాన్ని మరికొందరు నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.