»Tspsc Group 1 Prelims Exam Cancellation Petition Telangana High Court Issues Notices To Tspsc
Group1 Exam: TSPSCపై కోర్టు సీరియస్..ఫొటో, నంబర్ లేకుండా ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారు?
తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు గురించి విచారణ సందర్భంగా TSPSC పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్‌లో హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను అరికట్టడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని నిలదీసింది.
TSPSC Paper Leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా TSPSC పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్‌లో హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను అరికట్టడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని నిలదీసింది. బయోమెట్రిక్, ఫోటో కోసం రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుందని TSPSC చెప్పగా, పరీక్ష నిర్వహణలో ఖర్చు ముఖ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు పలు సందేహాలు లేవనెత్తారు. దీనిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల బయోమెట్రిక్‌లు సేకరించలేదని, ఓఎంఆర్ షీట్‌లోని హాల్‌టికెట్, ఫొటో అనుమానాస్పదంగా ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. ఓఎంఆర్ షీట్‌పై హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది.
అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని TSPSCని హైకోర్టు ప్రశ్నించింది. అక్టోబర్‌లో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను నిరోధించే కీలక అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షలను ఎలా నిర్వహించాలో నిర్ణయించే విచక్షణ TSPSCకి ఉందని కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని TSPSC తెలిపింది. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఇన్విజిలేటర్లు ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా అభ్యర్థులను ధృవీకరించారని కోర్టుకు వివరించింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత TSPSCపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణలో ఖర్చుల సమస్య ముఖ్యం కాదు. పరీక్ష నిర్వహణకు అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారుగా అని కమిషన్ ను ప్రశ్నించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని TSPSCకి కోర్టు నోటీసులు జారీ చేసింది.