రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు వనపర్తి జిల్లా వాసులుగా గుర్తించారు.