తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, ఇది రైతు సర్కార్ అని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వీఎం అబ్రహంతో కలిసి మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ...
అందమైన నగిషీలు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, ఫౌంటైన్లు, గార్డెన్లు, సహజసిద్ధమైన వెలుతురు.. విశాలమైన కార్యాలయాలు, గదులు, హెలీప్యాడ్ ఇవన్నీ తెలంగాణ సచివాలయంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఒక స్టార్ హోటల్ ను తలదన్నేట్టుగా తెలంగాణ సచివాలయం నిర్మితమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమవుతున్న ఈ సచివాలయం అందరినీ అబ్బురపరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చరిత్రాత్మక భవనాన్ని నిర్...
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఎవరు ఏమిటో ప్రజల వద్ద తేల్చుకుందామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తెలంగ...
రవాణా సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలను సజ్జనార్ ప్రారంభించారు. ఏఎమ్ 2 పీఎమ్ అనే సరికొత్త కొరియర్ సేవలను శుక్రవారం ప్రారంభించగా.. శనివారం ఆర్టీసీ బస్సుల్లో రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా రెండు రోజుల్లో రెండు కీలకమైన కార్యక్రమాలు ప్రారంభించి ప్రయాణికులకు ఆర్ట...
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మి...
ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్నారు. ఇది బీజేపీకి చివరి బడ్జెట్. పెట్టేది ఏదో పెద్దలకు అనుకూలంగా కాదు.. ప...
కరోనా మహమ్మారి ఇంకా పూర్తి తొలగిపోనేలేదు. అంతలోనే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.హైదరాబాద్ లో కొత్త రకం జ్వరం విజృంభిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరించారు. క్యూ ఫీవర్ గా పిలిచే ఈ వ్యాధి ఇప్పటికే పలువురిలో బయటపడిందని చెప్పారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, కబేళాలకు దూరంగా ఉండాలని సూచించారు. నగరానికి చెందిన 250 మంది మాంసం విక్రేతలకు వైద్య పరీక్షలు నిర్వహించగా....
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్దిక మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబందించిన వివరాల్ని పోస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలంగాణ రె...
తెలంగాణ ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవితతో ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్‌గా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల విస్త...
కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగి అవకాశం బిజెపిలోనే ఉంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, మిగతా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తను అయిన తను రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యానని, చాయ్ వాలా ప్రధాని అయ్యారని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు. నేను దానిని స...
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవ...
నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...
ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...
బైక్ పై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు నమోదు చేయించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందీ ఘటన. కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్‌లో ద్విచక్ర పై వస్తుండడాన్ని గమనించిన స్థానిక ఎస్సై రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి ముర...