తెలంగాణ ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవితతో ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి విషయాల్లో కేసీఆర్ కూతరు, ఎమ్మెల్సీ కవిత కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితతో శరత్ కుమార్ భేటీ కావడంపై వెనక తమిళనాట బీఆర్ఎస్ విస్తరణ వ్యుహాలు కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు శరత్ కుమార్ సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.