• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చిల్పూర్ గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

JN: చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ గుట్టలో 9 రోజుల బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూలైన్, వసతి, అన్నప్రసాద వితరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈనెల 28న బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. దేవస్థానం ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తెలిపారు.

February 23, 2026 / 09:24 AM IST

21 డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను పారిశుధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. గత కౌన్సిల్ గడువు ముగిసిపోవడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నూతనంగా కార్పొరేటర్ ఫలితాలు వెలవడి, డివిజన్ నుంచి గెలిచిన గుండా సంతోష్ పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

February 23, 2026 / 09:21 AM IST

నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం: వనపర్తి కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్య క్రమం నేటి నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతులను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

February 23, 2026 / 09:19 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖిలా WGLకు చెందిన కోల వెంకటేష్ (38) ద్విచక్ర వాహనంపై వరంగల్ మున్సిపాలిటీ వైపు వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 09:18 AM IST

కబడ్డీ ఆడిన క్రీడా శాఖ మంత్రి

NRPT: మక్తల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ ఆదివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఆయన క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. పురుషుల రంగారెడ్డి-గద్వాల్, మహిళల రంగారెడ్డి-ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ను మంత్రి తిలకించారు.

February 23, 2026 / 09:16 AM IST

రెప్పపాటులోనే యూరియా ఖాళీ

NLG: నిడమనూరు ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుకింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే ‘నో స్టాక్’ అని వస్తుండటంతో రైతులు అయోమయం చెందుతున్నారు. గత నాలుగు విడతల్లో 1,872 బస్తాల యూరియా వచ్చినప్పటికీ, సాధారణ రైతులకు మాత్రం ఒక్క బస్తా కూడా దక్కడం లేదు. రోజుల తరబడి వేచి ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో సాగు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 09:15 AM IST

దర్వేశీపురంలో రేణుక ఎల్లమ్మ దివ్యదర్శనం

NLG: దర్వేశీపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం రాత్రి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈవో నాగిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

February 23, 2026 / 09:13 AM IST

‘పాప మృతికి కారణమైన వారిని శిక్షించాలి’

MNCL: నాగర్ కర్నూల్ జిల్లాలో రజక దంపతులపై దాడి చేసి 2 నెలల పసి పాప మృతికి కారణమైన వారిపై హత్య నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లికి చెందిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని MHD ఖండిస్తుందన్నారు.

February 23, 2026 / 09:12 AM IST

బీఆర్ఎస్ నేత రవీందర్ కన్నుమూత

MDK: వల్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

February 23, 2026 / 09:11 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. టికెట్ల రూపంలో రూ.1,23,710, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.60,900, అన్నదానానికి రూ.28,412 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేవాలయానికి రూ.2,13,022 ఆదాయం లభించిందని వెల్లడించారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి: ఏఈఓ

MNCL: జన్నారం మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలని మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు రోజులుగా మబ్బు పట్టిన వాతావరణం ఉందన్నారు. రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయని, మబ్బు పట్టడంతో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ సమయంలో పంటలకు వివిధ తెగులు సోకే ప్రమాదం ఉందని, వాతావరణ మార్పులను గమనించాలన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ASF: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. కెరమెరి ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. కెరిమెరికి చెందిన గుర్నాలే వార్లు(74) బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపునకు వెళ్తున్న ఆయను, వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

February 23, 2026 / 09:10 AM IST

సమాజంలో మహిళలు పాత్ర కీలకం: గోడం రేణుక

ADB: సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించాలని ఆదివాసి తుడుందెబ్బ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుక అన్నారు. మావల మండల కేంద్రంలో సంఘం నాయకులతో ఆదావారం సమావేశమై ఆమె మాట్లాడారు. మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు గణేష్, దాదీ రావు, మనోజ్, ఇందిర, రమేష్ తదితరులున్నారు.

February 23, 2026 / 09:09 AM IST

జాతర ఘటన.. NHRCకి ఫిర్యాదు

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2 నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:09 AM IST

ఈనెల 26 నుంచి ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభం

VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఎల్లమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జాతర సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొమురక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు గుడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

February 23, 2026 / 09:08 AM IST