MDCL: అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ ఉమా గౌరీ, డిప్యూటీ DMHO లావణ్యలు హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ముఖ్య అతిథులను సత్కరించి బహుమతులను అందజేశారు.
PDPL: మోడల్ స్కూల్ ప్రవేశాలకు (2026-27) దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి గడువు అని ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థులు త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పాఠశాలలో దరఖాస్తులకు సంబంధించి హెల్ప్ లైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోకలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
KMR: బాన్సువాడ SRNK ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. TASK, IQAC, ప్లేస్మెంట్ సెల్, TSKC, ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తృతీయ సంవత్సరం చదువుతున్న, 2020 నుంచి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఆరే సంక్షేమ సంఘం నేతలు కలిశారు. ఉప్పల్ భాగాయత్‌లో ఆరే సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ఆరే కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను నేతలు కోరారు. రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, ఆరే సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
ADB: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో ఆటో కార్మికులకు ఆటో స్టాండ్ కోసం స్థలాన్ని కేటాయించాలని డ్రైవర్లు కోరారు. రైల్వే సీఐని కలిసి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 25 ఆటోలను రైల్వే స్టేషన్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సీఐ ఆధ్వర్యంలో ఆటోలకు స్టిక్కర్స్ అతికించారు.
ఖమ్మం: శ్రీనివాసనగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆయన ఆసుపత్రిలోని పారిశుధ్య పనులు, వోపీ సేవలు, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
SRCL: ప్రజల మనసు దోచుకోవాలంటే అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐదో వార్డులో నిర్మించిన పురపాలక సంఘ కమ్యూనిటీ హాల్‌ను కేటీఆర్ ప్రారంభించిమాట్లాడారు. సిరిసిల్లలోనే కాదు ఇలాంటి కమ్యూనిటీ భవనాలు కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కట్టుకున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి మున్సిపల్ మంత్రిగా రూ.44 కోట్లు మంజూరు రద్దు చేసిందన్నారు.
SRD: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది తమ సమస్యలను అదనపు ఎస్పీకి వివరించారు.
NRML: ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో అవగాహన కల్పించనున్నాయి.
MBNR: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలతో తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సూచించారు. రామచంద్రాపురం జడ్పీ హైస్కూల్ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. IIITలో సీటు వచ్చేలా ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదవాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
JGL: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 16న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు తెలిపారు. ఈ మేరకు జగిత్యాలలో సమావేశం నిర్వహించారు. వంట కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలనే హామీ అమలు చేయాలని, మెస్ బిల్లులు, కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
BHNG: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల శిక్షణ కోసం ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని AIYF డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. AIYF జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఏల్లంకి మహేష్, మహేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యావంతులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు.
KNR : ఈనెల 14న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” పేరిట మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.కరీంనగర్ పార్లమెంట్ పcరిధిలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో చేపట్టనున్నారు
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రేపు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు చింతపల్లి మండలం తీదేడులో భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. 10 గంటలకు జాల్ తండాలో ‘ప్రజా పాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తారు. అనంతరం 11:30 గంటలకు క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహిస్తారు.