• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

DCC అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రామకృష్ణ

NZB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరంలో నిజామాబాద్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో పార్టీ బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునేలా రూపొందించిన వ్యూహాలను, భవిష్యత్తు కార్యచరణను వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

February 22, 2026 / 03:30 PM IST

కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

RR: శంషాబాద్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ నూతన భవనాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ భవనం కమ్యూనిటీ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్, ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు.

February 22, 2026 / 03:26 PM IST

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం BJP జిల్లా కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మన్ కీ బాత్” అంటే దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ వేదిక అని అన్నారు.

February 22, 2026 / 03:25 PM IST

పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో కమాన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దశలవారీగా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పు స్వరూప, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:21 PM IST

పిట్లం లయన్స్ క్లబ్‌కు 11 అవార్డులు

KMR: లయన్స్ క్లబ్ ఇంటర్‌‌నేషనల్ (2024-25) అవార్డుల వేడుకలో పిట్లం లయన్స్ క్లబ్ విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ క్లబ్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వ్యక్తిగత అవార్డులను కూడా అందుకున్నారు. ఉత్తమ అధ్యక్షుడిగా కాశిరెడ్డి, ఉత్తమ మండలాధ్యక్షుడిగా కిషన్ ఎంపికయ్యారు. వీరితో పాటు సంజీవరెడ్డి, వేణుగోపాల్ తమసేవా కార్యక్రమాలకు అవార్డులు అందుకున్నారు.

February 22, 2026 / 03:20 PM IST

ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన

NLG: ఉరుమడ్లలో ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల నూతన నిర్మాణ పనులకు తెలంగాణ డెయిరీ కార్పోరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుశ్రీ, నాయకులు దేవేందర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న అమిత్ రెడ్డిని గ్రామ ప్రజలు అభినందించారు.

February 22, 2026 / 03:20 PM IST

వెన్నం రాఘవేందర్ రెడ్డికి సీఎం నివాళి

MHBD:మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులుఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

కోతులను తరిమికొట్టేందుకు వినూత్న ప్రయత్నం

KNR: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ, ఇండ్లపైకి చేరి బెంబేలెత్తిస్తున్న వానరాలను తరమడానికి శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచించి ఎలుగుబంటి డ్రెస్, మాస్క్‌ను తెప్పించింది. వాటిని ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డులలో తిప్పుతూ కోతులను తరిమివేశే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

February 22, 2026 / 03:09 PM IST

గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.

February 22, 2026 / 03:07 PM IST

చెన్నకేశవ స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: పదర మండలం రాయలగండి క్షేత్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. ఈ వేడుకలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో తన వంతుగా సొంత నిధులు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఆహ్వానించిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 03:05 PM IST

పోగొట్టుకున్న ప్రయాణికురాలి ఫోన్ అందజేత

KMR:ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు.ఆదివారం NZB రెండో డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్‌ను సీట్లోనే మర్చిపోయింది. బస్సు కామారెడ్డి చేరుకున్నాక ఫోన్‌ను గమనించిన కండక్టర్ నమ్రత, వెంటనే బస్టాండ్ పాయింట్ కంట్రోలర్ సమక్షంలో సదరు ప్రయాణికురాలికి దానిని అందజేశారు.

February 22, 2026 / 02:51 PM IST

ముత్యాలమ్మ మారమ్మ ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన

NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో పాత ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల స్థలంలో నూతన నిర్మాణానికి తెలంగాణ డైరీ కార్పోరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డి, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ, ఉపసర్పంచ్ నరేష్, కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, జనపాల శీను, దినేష్, హరి ప్రసాద్, పూలమ్మ పాల్గొన్నారు.

February 22, 2026 / 02:47 PM IST

కొనసాగుతున్న పరిగి-షాద్నగర్ రహదారి నిర్మాణ పనులు

VKB: పరిగి-షాద్నగర్ వరకు నాలుగు లైన్‌ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి ఇరువైపులా యంత్రాలతో విస్తృతంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. సూచిక బోర్డులను వాహనదారులు గమనించాలని తెలిపారు.

February 22, 2026 / 02:45 PM IST

13వ వార్డులో దోమల మందు పిచికారి

SRPT:​ కోదాడ పట్టణంలోని 13వ వార్డులో ఆదివారం దోమల మందు పిచికారి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆదేశాల మేరకు, వార్డు కౌన్సిలర్ గురవమ్మ సైదిబాబు యాదవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఫాగింగ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

February 22, 2026 / 02:43 PM IST

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

RR: కేశంపేట(మం) ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువనాయకుడు శ్రీనివాసులు స్పందించి అంజయ్య అంత్యక్రియలకు రూ.10,000 మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

February 22, 2026 / 02:42 PM IST