• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

HYD: మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని కోరారు.

February 23, 2026 / 01:02 PM IST

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునికి జాతరకు ఆహ్వానం

PDPL: ముర్మూర్ కొమరన్న జాతరకు హాజరుకావాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను జాతర ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య కోరారు. సోమవారం ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయనను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుంచి మార్చి 3 వరకు మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణోత్సవం జరుగుతుందన్నారు.

February 23, 2026 / 01:02 PM IST

చిన్నారి మృతి.. లింగాలలో నిరసన

NGKL : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర జాతరలో కులోన్మాదానికి బలైన చిన్నారి ఘటనను నిరసిస్తూ సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో MRPS, రజక సంఘం నాయకులు కుమ్మెర కు బయల్దేరారు. నిందితులను శిక్షించాలని MRPS నేత బంగారయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS కార్యకర్తలు పాల్గొన్నారు.

February 23, 2026 / 01:02 PM IST

‘హరినామ సప్త కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం’

ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరేడిగొండలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 11న గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ, మూర్తి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు అనిల్ జాదవ్ అనుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

February 23, 2026 / 01:01 PM IST

కలెక్టరేట్ ఎదుట డ్రైవర్ల నిరసన

KNR: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 23, 2026 / 01:01 PM IST

సికింద్రాబాద్‌లో నకిలీ బేరింగుల దందా.. మాల్ సీజ్..!

HYD: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్‌నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగులు, వేల సంఖ్యలో ప్యాకింగ్ బాక్సులను సీజ్ చేశారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 12:58 PM IST

ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:56 PM IST

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

BDK: క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగిస్తున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్వాల విమలాదేవి ఎన్నికయ్యారు. సోమవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొత్వాలతో పాటు విమలాదేవిని సత్కరించారు.

February 23, 2026 / 12:54 PM IST

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామంలో బొల్ల భవాని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.

February 23, 2026 / 12:52 PM IST

‘ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి’

BDK: అశ్వారావుపేటలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive – Phase 2 కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్సై అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 23, 2026 / 12:49 PM IST

కలెక్టరేట్‌కు చేరుకున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరిన KMR ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సముదాయానికి చేరుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు నెలకొన్న నేపథ్యంలో కలెక్టరేట్ సముదాయానికి రావాలని ఎమ్మెల్యే శనివారం సవాలు విసిరిన విషయం విధితమే. సవాలను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు సైతం కలెక్టరేట్ కి వస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది.

February 23, 2026 / 12:48 PM IST

రాష్ట్రస్థాయి కరాటేలో సత్తా చాటిన కోనాపూర్ విద్యార్థులు

NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మెట్పల్లిలో నిర్వహించిన ఛాంపియన్‌షిన్‌లో పాల్గొని 5 స్వర్ణ, 8 రజత,14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ ఉదయ్, సోమవారం అభినందించారు. విద్యార్థుల కృషిని కొనియాడుతూ..వారికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 12:47 PM IST

‘పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి’

NLG: దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహానికి రజక సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసి 2 నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 12:46 PM IST

జిన్నారంలొ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జీవన శివాలయంలో ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.

February 23, 2026 / 12:45 PM IST

ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ. 200/-

HYD: మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు.

February 23, 2026 / 12:42 PM IST