• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విజేతలను అభినందించిన సీపీ సాయి చైతన్య

NZB: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’లో జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందిని సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.

February 23, 2026 / 07:00 PM IST

కేటిదొడ్డి తహశీల్దార్‌కు సన్మానం

GDWL: కేటిదొడ్డి మండల నూతన తహసీల్దార్ కరుణాకర్‌ను ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలు, భూభారతి పనులను త్వరగా పరిష్కరించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్, ప్రతి సమస్యను పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 06:59 PM IST

CM కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: JNS స్టేడియంలో CM కప్ ముగింపు కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయికి పంపించేందుకు సీఎం CUP ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:59 PM IST

కలెక్టర్ ప్రజావాణిలో 50 ఫిర్యాదులు: సంతోష్

NGKL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి 50 అర్జీలను స్వీకరించారు. అందిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 23, 2026 / 06:58 PM IST

‘ఫీజులు చెల్లించకపోయిన హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందే’

RR: విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయిన కచ్చితంగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని AISF రంగారెడ్డి జిల్లా సహాయకార్యదర్శి శివకుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు ఫీజులు కట్టలేదని సాకుతో ఈ పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని, హాల్ టికెట్స్ జారీ చేయాలన్నారు.

February 23, 2026 / 06:57 PM IST

కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా

RR: అక్రిడిటేషన్ కార్డులలో కోత విధించడంపై RR జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ఉన్న ఒక్క గుర్తింపు కార్డును తొలగిస్తే వారికి ప్రయోజనం ఏముంటుందన్నారు. గతంలో అర్హత లేనివారికి కార్డులు ఇవ్వమంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉన్న వారిని సైతం పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

February 23, 2026 / 06:56 PM IST

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

SRD: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ జానకి రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

February 23, 2026 / 06:55 PM IST

‘శిశువుల మిస్సింగ్ ఘటనకు, ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు’

PDPL: పెద్దరాత్ పల్లిలో మిస్సింగ్ అయిన పిల్లలు తల్లిదండ్రుల వద్దనే ఉన్నారని DCHS డా. శ్రీధర్ తెలిపారు. శిశువులను, తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టామన్నారు. శిశువుల సంరక్షణ నిమిత్తం KNR శిశుగృహకు తరలించామని, సంఘటనపై పూర్తి విచారణ చేయడానికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటనకు మాతా శిశు ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

February 23, 2026 / 06:53 PM IST

ఎమ్మెల్యేకు మొదటి ఆహ్వాన పత్రిక అందజేత

RR: ఈనెల 26,27,28 తేదీల్లో షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటి ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు.

February 23, 2026 / 06:50 PM IST

రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ భీమేశ్వరస్వామి దేవస్థానం భక్త జనసంద్రమైంది. రాష్ట్ర నలు మూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేకపూజలు నిర్వహిస్తున్నారు.

February 23, 2026 / 06:47 PM IST

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయ సేవా సంస్థ

WGL: నల్లబెల్లిలోని KGVBలో సోమవారం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిరోధ చట్టం, వరకట్న నిరోధ చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:45 PM IST

బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

NLG: గుర్రంపోడు మండలం శాంతినగర్‌లో రూ.511.30 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో సుల్తాన్పూర్, ఎలమోనిగూడెం, తేనేపల్లి గ్రామాల ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 135/4 కి.మీ మేర ఈ రహదారి విస్తరించనుంది.

February 23, 2026 / 06:43 PM IST

ఎంపీని కలిసిన జగిత్యాల్ కౌన్సిలర్లు

JGL: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల్, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. భోగ శ్రావణి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:41 PM IST

రేపు నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ విస్తృత పర్యటన

SRPT: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు హుజూర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రామస్వామిగుట్ట హౌసింగ్ కాలనీని పరిశీలించి, దొండపాడు రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకం, జానపహాడ్ లిఫ్ట్ పథకాల పనులను సమీక్షిస్తారు. అనంతరం నేరేడుచర్ల మండలంలో పలు బీటీ రహదారులను ప్రారంభించనున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

February 23, 2026 / 06:40 PM IST

‘బాధితుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

MDK: బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్హెచ్ఓ లకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పైరవులకు తావు లేకుండా సంప్రదించాలని సూచించారు.

February 23, 2026 / 06:32 PM IST