• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్, 5,000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పరకాల మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు.

February 26, 2026 / 06:34 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: శ్రీనివాసరెడ్డి

ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలందరికీ సంక్షేమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 06:33 PM IST

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి: MLA

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MHBD MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరై వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని MLA సూచించారు.

February 26, 2026 / 06:33 PM IST

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సీతక్క

MLG: తాడ్వాయి మండలం మేడారంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పూర్తయిన ఇళ్లుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 06:33 PM IST

శ్రీకృష్ణ దేవాలయ ప్రహరి గోడ ప్రారంభం

NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రహరీ గోడను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. అనంతరం స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కుడు అనురాధ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:33 PM IST

రేపు RTC పార్సిళ్ల వేలం పాట.. 30% డిస్కౌంట్

HYDలో కస్టమర్లు తీసుకోని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు RTC కార్గో విభాగం ప్రకటించింది. ఫిబ్రవరి 27న సికింద్రాబాద్ జేబీఎస్ కార్గో కార్యాలయంలో ఈ వేలం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ వేలంలో సుమారు 60 రకాల సరుకులు అమ్మకానికి ఉంటాయి. వస్తువులు అసలు ధర కంటే గరిష్టంగా 30% తక్కువ ధరకు లభించే అవకాశం ఉందన్నారు.

February 26, 2026 / 06:32 PM IST

రేపు నీటి సరఫరా నిలిపివేత

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నందున పైప్ లైన్ షిఫ్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైన కలనీలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

February 26, 2026 / 06:32 PM IST

మత్తడి దూకుతున్న అనంతారం ప్రాజెక్టు

SRCL: ఇల్లంతకుంట మండలంలోని అనంతారం ప్రాజెక్టు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి వేసవి ముందు మత్తడి దూకుతూ గురువారం జలకళను సంతరించుకుంది. ఈ జలాల విడుదల వల్ల స్థానిక రైతులకు సాగునీటి అవసరాలను తీరుస్తూ పంటలను కాపాడుతున్నదని హార్షం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 06:30 PM IST

‘త్రాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం’

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నల్లాల బావి దగ్గర మోటార్ పాడైపోవడంతో గురువారం GP కార్యదర్శి రంజిత్, 5వ వార్డు మెంబర్ రాజేందర్, 6వ వార్డు మెంబర్ సురేష్, GP పంప్ ఆపరేటర్ అంజి గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ రాజేందర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తాగునీటి సమస్య ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

February 26, 2026 / 06:29 PM IST

ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా?

KMM: జిల్లా వెలగమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా? ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కాగా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

February 26, 2026 / 06:27 PM IST

రిలే దీక్షకు మద్దతు తెలిపిన 3వ వార్డు కౌన్సిలర్

JN: జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోతున్న బాధిత ప్లాట్ యజమానుల రిలే దీక్షకు 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మద్దతు తెలిపారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ఏకశిలా గడ్డకు ప్లాట్లు కోల్పోతున్న భూ-యజమానులు నష్టపరిహారం ఇవ్వాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

February 26, 2026 / 06:24 PM IST

బంజారా ప్రజలకు దిశా నిర్దేశం.. సేవాలాల్ మహారాజ్

BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం మొత్తంలో ఉన్న బంజారా ప్రజలను ఏకం చేసి సన్మార్గాన్ని చూపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.

February 26, 2026 / 06:21 PM IST

మీడియా క్లబ్ నూతన కమిటీకి మాజీ MLA సన్మానం

MDCL: ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన నివాసంలో సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నేతృత్వంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐక్యంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసరమైన సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 06:20 PM IST

యాదవ కౌన్సిలర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఘన సన్మానం

SRPT: హుజూర్నగర్ పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన జక్కుల మల్లయ్య, మోదాల కామేశ్వరి, కోడి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సుంకరి శివరామ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.

February 26, 2026 / 06:20 PM IST

‘Arrive అండ్ Alive’ పై కార్మికులకు అవగాహన

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ఇండస్ మెడికేర్ కంపెనీలో ‘Arrive అండ్ Alive’ 2వ దశ కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.

February 26, 2026 / 06:20 PM IST